: కోట్లాలో 'విరాట్' పర్వం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (58 బంతుల్లో 99; 10 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ తో ఢిల్లీ డేర్ డెవిల్స్ పాలిట యముడయ్యాడు. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో సూపర్ బ్యాటింగ్ ప్రదర్శన చేసిన కోహ్లీ పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. ఢిల్లీ బౌలింగ్ ను ఊచకోత కోసిన కోహ్లీ ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటయ్యాడు. కోహ్లీకి తోడు డివిల్లీర్స్ (17 బంతుల్లో 32 నాటౌట్) రాణించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసింది.