shivani: వరుస సినిమాలతో రాజశేఖర్ కూతురు!

- తెలుగులో '2 స్టేట్స్' రీమేక్
- తమిళంలో విష్ణు విశాల్ జోడీగా
- మలయాళంలో ప్రణవ్ సరసన
రాజశేఖర్ కూతురు శివాని కథానాయికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. హిందీలో ఘన విజయాన్ని సాధించిన '2 స్టేట్స్' సినిమా తెలుగు రీమేక్ లో ఆమె నటిస్తోంది. తెలుగు సినిమాలో మాత్రమే కాదు .. తమిళ .. మలయాళ భాషల్లోను ఆమె ఎంట్రీ ఇస్తోంది. తమిళంలో విష్ణు విశాల్ జోడీగా ఆమె ఒక సినిమా చేస్తోంది. వీవీ స్టూడియోస్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం 'మధురై'లో షూటింగ్ జరుపుకుంటోంది.
