Kishan Reddy: భార్య కావ్య రాజకీయ రంగ ప్రవేశంపై స్పందించిన కిషన్ రెడ్డి!

  • కావ్య రాజకీయాల్లోకి రాబోదు
  • ప్రజల్లో ఉండి సేవ చేసుకుంటారంతే
  • ఎంపీగా తాను పోటీ చేసే విషయంపై సమాధానం దాటవేత

తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి భార్య కావ్య, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడతారని, అంబర్ పేట నుంచి ఆమె బీజేపీ తరఫున బరిలోకి దిగుతారని వస్తున్న వార్తలపై కిషన్ రెడ్డి స్పందించారు. తన భార్య రాజకీయాల్లోకి రాబోవడం లేదని, ఇదే సమయంలో ప్రజా సేవ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో కావ్య ప్రజల్లోకి వచ్చి చురుకుగా తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆమె కేవలం సేవా కార్యక్రమాలకు మాత్రమే పరిమితమని చెప్పారు. ఇక తాను ఎంపీగా పోటీ చేయనున్నట్టు వచ్చిన వార్తలపై మాత్రం ఆయన సమాధానాన్ని దాటవేయడం గమనార్హం.

Kishan Reddy
BJP
Amberpet
Kavya
  • Loading...

More Telugu News