Sujana Chowdary: రాజ్యసభలో విభజన చట్టంపై చర్చకు నోటీసు ఇచ్చిన సుజనా చౌదరి

  • రూల్ 267 కింద రాజ్యసభలో సుజనా చౌదరి నోటీసు
  • ఈ ఉదయం గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టిన టీడీపీ ఎంపీలు
  • ఉభయసభల్లో 10 నిమిషాల పాటు నిరసన తెలపాలని నిర్ణయం

ప్రత్యేక హోదా, విభజన హామీలపై రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీడీపీ సిద్ధమైంది. రాజ్యసభలో ఏపీ పునర్విభజన చట్టంపై చర్చించేందుకు రూల్ 267 కింద సుజనా చౌదరి నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో, పెద్దల సభలో విభజన చట్టంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.

మరోవైపు పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి తోడు, పార్లమెంటు ఉభయసభల్లో 10 నిమిషాల పాటు నిరసన తెలపాలని నిర్ణయించారు. మరోవైపు శుక్రవారం నాడు లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై దాదాపు 12 గంటల పాటు చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని టీడీపీ ఎంపీలు దేశ ప్రజలకు వినిపించగలిగారు.

Sujana Chowdary
Rajya Sabha
AP Re-organisation Act
  • Loading...

More Telugu News