Pakistan: జైలులో షరీఫ్‌కు అస్వస్థత.. కిడ్నీఫెయిల్!

  • కిడ్నీ సమస్యతో బాధపడుతున్న షరీఫ్‌ 
  • ఆసుపత్రికి తరలించనున్న జైలు అధికారులు
  • ఆందోళనలో అభిమానులు, కార్యకర్తలు

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలులో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయనను అడియాలా జైలు నుంచి ఆసుపత్రికి తరలించేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జైలు ఆసుపత్రిలోనే ఆయనకు చికిత్స అందించాలని భావించినప్పటికీ, అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు.

నవాజ్‌కు వెంటనే చికిత్స అందకుంటే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని జైలులో ఆయనను పరీక్షించిన వైద్యులు తెలిపారు. షరీఫ్‌కు కిడ్నీలు ఫెయిలయ్యాయన్న విషయం తెలిసిన ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Pakistan
Nawaz sharif
kidney fail
adiala jail
  • Loading...

More Telugu News