pawan kalyan: పవన్ కల్యాణ్ కు అంత శక్తి లేదు: చినరాజప్ప

  • టీడీపీని ఓడించే శక్తి పవన్ కు లేదు
  • బీజేపీతో జగన్, పవన్ కుమ్మక్కయ్యారు
  • ప్రజలకు ఇబ్బంది కలిగించేందుకే వైసీపీ రాష్ట్ర బంద్

తెలుగుదేశం పార్టీని ఓడించేంత శక్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లేదని ఏపీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. జగన్, పవన్ కల్యాణ్ లు బీజేపీతో కుమ్మక్కై... టీడీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం గురించి వీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతున్నది టీడీపీ మాత్రమేనని చెప్పారు.

జగన్ కు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని, పవన్ కల్యాణ్ కు జ్ఞానం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించేందుకే వైసీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిందని దుయ్యబట్టారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఏర్పాటైన పెట్రోల్ బంక్ ను ఈ రోజు ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు. నగర ప్రజలు ఈ పెట్రోల్ బంకును ఉపయోగించుకోవాలని కోరారు.

pawan kalyan
jagan
chinarajappa
  • Loading...

More Telugu News