Galla Jayadev: అవిశ్వాసంపై గల్లా జయదేవ్ ప్రసంగానికి లక్షల్లో లైక్స్!

  • అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన గల్లా
  • సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ప్రసంగం
  • ట్విట్టర్, యూ ట్యూబ్ లలో రెండున్నర లక్షల చొప్పున లైక్స్

'భరత్ అనే నేను' సినిమాను ప్రస్తావిస్తూ, కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన గల్లా జయదేవ్ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆయన నరేంద్ర మోదీని విమర్శించిన తీరుకు లక్షల్లో లైక్స్ వచ్చాయి. ఆయన ప్రసంగాన్ని వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో దాదాపు 80 లక్షల మందికి పైగా వీక్షించారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఆయన ప్రసంగంలోని వ్యాఖ్యల వీడియోలు, ఫొటోలు హల్ చల్ చేశాయి.

ట్విట్టర్, ఫేస్ బుక్ లలో రెండున్నర లక్షల మంది చొప్పున, యూట్యూబ్ లో మూడున్నర లక్షల మంది ఆయన ప్రసంగానికి లైక్స్ కొట్టారు. ఎంపీ జయదేవ్ ప్రసంగాన్ని టీడీపీ శ్రేణులంతా టీవీలకు అతుక్కుపోయి మరీ చూశారు. టీడీపీకి కేవలం 13 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చినప్పటికీ, దాదాపు గంట సేపు తన ప్రసంగాన్ని కొనసాగించిన జయదేవ్, నరేంద్ర మోదీ సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని దేశమంతటికీ తెలిసేలా చేశారు.

Galla Jayadev
Social Media
Twitter
Facebook
You Tube
  • Loading...

More Telugu News