Chennai: చెన్నైలో కూలిన భవనం.. ఒకరి మృతి!

  • కండంచవాడి ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం
  • ఒకరు మృతి.. 17 మందికి గాయాలు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

చెన్నైలో నిర్మాణంలో ఉన్న భవనంలోని ఓ భాగం కుప్పకూలిన ఘటనలో 17 మంది గాయపడ్డారు. శనివారం రాత్రి కండంచవాడి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్నది ఆసుపత్రి అని, ఐరన్ గిడ్డర్లు కూలడంతో 17 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే 8 అంబులెన్సులు, 3 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాల కింద చిక్కుకున్న 23 మందిని రక్షించారు. రక్షించిన వారిలో ఐదుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు చెన్నై కలెక్టర్ పొన్నియన్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు.

Chennai
Building
Trapped
collapse
  • Loading...

More Telugu News