Chandrababu: గల్లా జయదేవ్ ను అభినందించిన చంద్రబాబు

  • ఏపీ ఆవేదన తెలియజెప్పావు
  • ఐదు కోట్ల ఆంధ్రుల గొంతుకలు వినిపించావు
  • గల్లాను ప్రత్యేకంగా అభినందించిన బాబు

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడిన తీరుపై ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఈ సందర్భంగా గల్లా జయదేవ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఐదు కోట్ల ఆంధ్రుల గొంతుకలు వినిపించేలా ప్రసంగించావని, ఏపీ ఆవేదనను తెలియజేశావని గల్లాను బాబు ప్రశంసించారు.

కాగా, అవిశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ నేతలపై విరుచుకుపడ్డ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడిపై ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రజల కోసం ఎప్పుడూ ఇలానే పోరాడాలని సూచించారు. తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని హరీష్ శంకర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రసంగం అనంతరం ఓ ట్వీట్ చేశారు. ఏపీ ప్రజల గొంతుకను లోక్ సభలో   వినిపించే అవకాశం తనకు కల్పించిన చంద్రబాబుకు ధన్యవాదాలు చెబుతున్నానని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన హరీశ్ శంకర్ పైవిధంగా స్పందించారు.

Chandrababu
ram mohan naidu
galla jaya dev
  • Loading...

More Telugu News