Rangasthalam: ఎట్టకేలకు 'జిగేల్ రాణి'కి అందిన పారితోషికం... రూ. లక్ష పంపిన సుకుమార్!

  • జిల్ జిల్ జిల్ జిల్' పాట పాడిన గంట వెంకటలక్ష్మి
  • సూపర్ హిట్ అయిన సాంగ్
  • ఇంకా డబ్బులు అందలేదని ఆవేదన
  • బ్యాంకు ఖాతాకు డబ్బు పంపిన సుకుమార్

ఇటీవలి కాలంలో శత దినోత్సవం జరుపుకున్న ఏకైక చిత్రంగా నిలిచిన 'రంగస్థలం'లో సూపర్ హిట్ అయిన "జిల్ జిల్ జిల్ జిల్ జిగేలురాణీ" పాటను ఆలపించిన హరికథ కళాకారిణి గంట్ల వెంకటలక్ష్మికి ఎట్టకేలకు రెమ్యునరేషన్ అందింది. తనకు పాట పాడినందుకు ఇంకా డబ్బులు అందలేదని వెంకటలక్ష్మి మీడియాకు ఎక్కి, ఆవేదన వ్యక్తం చేయడంతో, ఈ విషయమై చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

దీనిపై స్పందించిన దర్శకుడు సుకుమార్, ఆమెకు లక్ష రూపాయలు పంపించారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం బీఆర్టీ కాలనీలో నివాసం ఉండే వెంకటలక్ష్మి, హరికథలను చూసిన దేవిశ్రీ ప్రసాద్, ఆమెకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. తనకు డబ్బు అందిన విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. తన బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అయిందని చెప్పారు.

Rangasthalam
Jigel Rani
Sukumar
Venkatalakshmi
  • Loading...

More Telugu News