Narendra Modi: 2024లోనూ అవిశ్వాసం పెట్టేలా ప్రతిపక్షాలకు బలం ప్రసాదించు స్వామీ: భగవంతుడిని కోరిన మోదీ

  • రాహుల్ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్
  • ఈ మధ్య శివభక్తి పెరిగిందని చురక
  • ప్రతిపక్షాల కోసం శివుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పిన మోదీ

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ లోక్‌సభలో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2024లో తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేలా ప్రతిపక్షాలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇటీవల అందరికీ శివుడిపై భక్తి పెరిగిందని, అందుకే తాను కూడా శివుడిని ప్రార్థిస్తున్నానని, ప్రతిపక్షాలు మళ్లీ అవిశ్వాస తీర్మానం పెట్టే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని చెప్పి సభలో నవ్వులు పూయించారు.

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి కౌంటర్ ఇస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ తనకు హిందూయిజం, శివతత్వం గురించి అర్థం తెలిసేలా చెప్పినందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

Narendra Modi
Rahul Gandhi
Lord shiva
  • Loading...

More Telugu News