Shivsena: మనసు మార్చుకున్న శివసేన.. ఓటింగ్‌కు దూరం!

  • లోక్‌సభలో ప్రారంభమైన చర్చ
  • ఒక్క రోజులోనే మనసు మార్చుకున్న శివసేన
  • మాట్లాడుతున్న గల్లా జయదేవ్

నిన్నటి వరకు బీజేపీకి మద్దతు ఇస్తామని ప్రకటించిన శివసేన తీరా సమయానికి చెయ్యిచ్చింది. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉండాలని నిర్ణయించింది. బీజేపీపై నిత్యం విరుచుకుపడే శివసేన గురువారం చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అవిశ్వాస తీర్మానం విషయంలో తమ ఓటు బీజేపీకేనని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ తెలిపారు. సాయంత్రానికి అధికారికంగా ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. అయితే, సరిగ్గా సమయానికి మనసు మార్చుకుంది. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.

మరోవైపు, లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి గల కారణాలను వివరిస్తున్నారు. లోక్‌సభకు తొలిసారి ఎంపికైన తనకు అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చలో మాట్లాడే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు.

Shivsena
No-Confidence Motion
Galla Jaydev
  • Loading...

More Telugu News