no confidence motion: అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభలో ప్రవేశపెట్టిన కేశినేని నాని.. చర్చను ప్రారంభించిన గల్లా జయదేవ్!

  • అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం
  • తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్టు చదివి వినిపించిన కేశినేని నాని
  • చర్చను ప్రారంభించాల్సిందిగా గల్లా జయదేవ్ ను కోరిన స్పీకర్

లోక్ సభలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రవేశపెట్టారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ను ప్రవేశపెట్టాలంటూ నానిని లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్ కోరడంతో ఆయన దాన్ని చదివి వినపించారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పై అవిశ్వాసాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అనంతరం చర్చను ప్రారంభించాల్సిందిగా టీడీపీ మరో ఎంపీ గల్లా జయదేవ్ ను స్పీకర్ కోరారు. ప్రస్తుతం ఆయన సభలో ప్రసంగిస్తున్నారు. 

no confidence motion
kesineni nani
galla jayadev
  • Loading...

More Telugu News