no confidence motion: అవిశ్వాసంపై చర్చలో మాట్లాడే వివిధ పార్టీల నేతలు వీరే!
- అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయని బీజేపీ, కాంగ్రెస్
- బీజేపీ తరపున ఐదుగురు
- కాంగ్రెస్ తరపున జ్యోతిరాదిత్య సింధియా
కాసేపట్లో లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమయ్యాయి. చర్చ సమయంలో ఎవరెవరు మాట్లాడాలో అన్ని పార్టీలు నిర్ణయించేశాయి. బీజేపీ తరపున ఐదుగురు మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అటు అధికారపక్షం కానీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం కానీ ఎలాంటి వివరాలను ప్రకటించనప్పటికీ... మనకు అందుతున్న సమాచారం ప్రకారం కింద తెలిపిన వారు మాట్లాడే అవకాశం ఉంది.
- కాంగ్రెస్ - జ్యోతిరాదిత్య సింధియా
- తృణమూల్ - సౌగత్ రాయ్, దినేష్ త్రివేది
- ఎన్సీపీ- సుప్రియా సూలే
- సీపీఎం - మహమ్మద్ సలీం
- సమాజ్ వాదీ పార్టీ - ధర్మేంద్ర యాదవ్
- ఆర్జేడీ - జై ప్రకాష్ నారాయణ్ యాదవ్
- బీజేపీ - అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే లేదా కిరీట్ పారిక్, మీనాక్షి లేఖి, ఉదిత్ రాజ్, హుకుమ్ దేవ్ నారాయణ్ యాదవ్ లేదా వీరేంద్ర సింగ్
- టీడీపీ - గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు.