Anissiya Batra: మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టిన భర్త.. ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్యకు కారణం అదే అంటున్న పోలీసులు!

  • గత వారంలో బిల్డింగ్ పై నుంచి దూకి అనిస్సియా ఆత్మహత్య
  • భర్తకు ముందే వివాహమైన విషయాన్ని తట్టుకోలేకపోయింది
  • భార్యాభర్తల మధ్య గొడవలు 

గత వారంలో న్యూఢిల్లీలో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఎయిర్ హోస్టెస్ అనిస్సియా బాత్రా (32) హత్య కేసును విచారించిన పోలీసులు, భర్త తొలి వివాహం గురించి దాచడంతో వచ్చిన విభేదాలే ఆమె ఆత్మహత్యకు కారణం అయ్యాయని తేల్చారు. తమ విచారణలో అనిస్సియా భర్త మయాంక్ కు ముందే మరో యువతితో వివాహం జరిగినట్టు గుర్తించామని, దీన్ని దాచిన ఆయన రెండేళ్ల క్రితం అనిస్సియాను పెళ్లి చేసుకున్నాడని ఓ అధికారి వెల్లడించారు.

వివాహ సమయంలో అడిగినంత కట్నంతో పాటు బీఎండబ్ల్యూ కారును కూడా ఇచ్చారని, హనీమూన్ కు వెళ్లినప్పటి నుంచే భర్త నుంచి ఆమె వేధింపులను ఎదుర్కొందని అన్నారు. నెల రోజుల ముందే మయాంక్ తొలి వివాహం గురించి అనిస్సియాకు తెలిసిందని, దీంతో ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయని చెప్పిన పోలీసులు, స్వతహాగా సున్నిత మనస్కురాలైన ఆమె, తన భర్తకు మరో భార్య ఉందన్న విషయాన్ని తట్టుకోలేక, బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.

కాగా, ఈ కేసులో మయాంక్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా, తమ కుమార్తెను వేధించిన అత్తమామలనూ జైలుకు పంపాలని అనిస్సియా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Anissiya Batra
Air Hostes
Sucide
Police
Mayank
  • Loading...

More Telugu News