: ఆమె నిజంగా అదృష్టవంతురాలే!
బంగ్లాదేశ్ లో ఓ వాణిజ్య సముదాయం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు 1000 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఢాకాలో ఆ ఎనిమిది అంతస్తుల భవంతి కూలి వారాలు గడుస్తున్నా, ఇంకా వెలికితీత చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, శిథిలాల కింద ఓ మహిళ సజీవంగా కనబడి అందర్నీ విస్మయంలో ముంచెత్తింది. అత్యంత బలహీనంగా ఉన్న ఆమెను స్థానిక మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ఆమెను రేష్మాగా గుర్తించారు. అందుబాటులో ఉన్న నీటిని తాగుతూ ఆమె 17 రోజుల పాటు ప్రాణాలు నిలుపుకొని ఉంటుందని భావిస్తున్నారు.