Kurnool District: బస్సులో మహిళా కండక్టర్ పై ఇటిక్యాల స్వామి దాడి... దేహశుద్ధి చేసిన ప్రయాణికులు!

  • తీసుకున్న స్టేజ్ లో బస్సు దిగని జయదేవ్ స్వామి
  • ప్రశ్నించిన మహిళా కండక్టర్ పై దాడి
  • పోలీసులకు అప్పగించిన ప్రయాణికులు

బస్సెక్కి, టికెట్ తీసుకున్న స్టేజీలో దిగకుండా ఉన్న ఓ స్వామీజీ, తనను ప్రశ్నించినందుకు మహిళా కండక్టరుపై దాడికి దిగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. కొలిమిగండ్ల పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. నంద్యాల డిపోకు చెందిన ఎక్స్ ప్రెస్ బస్సు తాడిపత్రికి వెళుతుండగా, దానిలో కడపకు చెందిన బూరుగుల సుబ్బలక్ష్మి కండక్టర్ గా విధుల్లో ఉంది.

బనగానపల్లె వద్ద ఇటిక్యాల గీతాశ్రమానికి చెందిన జయదేవ్ స్వామి ఆ బస్సు ఎక్కాడు. కొలిమిగుండ్ల వరకూ టికెట్ తీసుకున్నాడు. కొలిమిగండ్ల వరకూ రాగానే దిగాలని కండక్టర్ కోరగా, నిరాకరిస్తూ, తాను ఇటిక్యాలలో దిగుతానని పట్టుబట్టాడు. ఆ బస్సు ఎక్స్ ప్రెస్ సర్వీసని, టికెట్ తీసుకున్న స్టేజీలో దిగాలని ఆమె కోరగా, వాగ్వాదానికి దిగి దాడి చేశాడు. అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతని ఆగడం శ్రుతి మించడంతో బస్సులోని ఇతర ప్రయాణికులు అడ్డుకుని దేహశుద్ధి చేసి, బస్సును తిరిగి కొలిమిగుండ్లకు తెచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Kurnool District
APSRTC
Bus
Swamy
Lady Conductor
  • Loading...

More Telugu News