Prabhas: ఇంత వెటకారం ఎందుకు? హీరో సిద్ధార్థ్ పై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్!

  • ప్రభాస్ పుట్టిన రోజుకు 100 రోజుల సమయం ఉందన్న రమేష్ బాలా
  • తరువాతి పుట్టిన రోజుకు 465 రోజులుందన్న సిద్ధార్థ్ 
  • ట్రోలింగ్ ప్రారంభించిన ప్రభాస్ అభిమానులు

నటుడు సిద్ధార్థ్ పై ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. ఆయన పుట్టిన రోజుపై సిద్ధార్థ్ చేసిన కామెంట్ వెటకారంగా ఉందని వ్యాఖ్యానిస్తూ, టాలీవుడ్ జోలికి రావద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, తమిళ సినీ విశ్లేషకుడు రమేష్ బాలా, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ ప్రభాస్ పుట్టిన రోజుకు ఇంకా 100 రోజుల సమయం ఉందని, ఇప్పటికే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ట్వీట్ చేశాడు.

దీనిపై సిద్ధార్థ్ స్పందిస్తూ, "నెక్ట్స్ పుట్టినరోజుకు 465 రోజులుంది" అంటూ కామెంట్ పెట్టాడు. ఇది ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పించగా, సిద్ధార్థ్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. టాలీవుడ్ జోలికొస్తే చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. 'ఎందుకు ఇంత వెటకారం? నీ ఫ్రెండే కదా?' అని ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యపై సిద్ధార్థ్ స్పందిస్తూ, "అందుకే భయ్యా. ఫ్రెండు కాబట్టే... ఫ్రీడం తీసుకున్నా... డార్లింగ్‌ కూడా నవ్వుతాడు జోక్‌ విని. ప్రతిదానికి టెన్షన్‌ పడితే లైట్‌ తీసుకోడానికి టైమ్‌ ఉండదు కదా భయ్యా?" అంటూ వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశాడు. ఇకనైనా ఫ్యాన్స్ శాంతిస్తారేమో!

Prabhas
Sidharth
Fans
Tollywood
Birthday
Trolling
  • Error fetching data: Network response was not ok

More Telugu News