Anil Kumar Singhal: టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం: ఈవో సింఘాల్

  • చంద్రబాబు ఆదేశాలతో కదిలిన బోర్డు
  • దర్శనాలకు విధివిధానాలు ఖరారు చేసేందుకే
  • వెల్లడించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్

మహా సంప్రోక్షణ సమయంలో భక్తులను దర్శనాలకు అనుమతించాల్సిందేనని, ఆ మేరకు కార్యాచరణను రూపొందించుకోవాలని సీఎం చంద్రబాబునాయుడి నుంచి ఆదేశాలు రావడంతో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో చైర్మన్, పాలకమండలి సభ్యులు పాల్గొంటారని తెలిపారు.

 సమావేశం కన్నా ముందు దర్శనాల విషయంలో భక్తుల అభిప్రాయాలను తీసుకుంటామని ఆయన తెలిపారు. మహా సంప్రోక్షణ సమయంలో దర్శనాలపై విదివిధానాలను ఈ సమావేశంలో చర్చించి ప్రకటిస్తామని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని చంద్రబాబు ఆదేశించారని, ఆయన ఆదేశాల ప్రకారం బోర్డు సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

Anil Kumar Singhal
TTD
EO
Chandrababu
  • Loading...

More Telugu News