Smart Phone: మాట్లాడుతుంటే పేలిన స్మార్ట్ ఫోన్... చిత్తూరు జిల్లాలో ఘటన!

  • వేడెక్కి, పొగలొచ్చి పేలిన ఫోన్
  • తప్పిన ప్రాణాపాయం
  • మరో ఫోన్ ఇప్పించాలని బాధితుడి డిమాండ్

ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉండగా, వేడెక్కి, ఆపై పొగలు వచ్చి స్మార్ట్ ఫోన్ పేలిన ఘటన చిత్తూరు జిల్లా ఐరాల మండలం జంగాలపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన జితేంద్రరెడ్డి, ఆరు నెలల క్రితం ఆన్ లైన్ లో రూ. 12 వేలకు ఈ స్మార్ట్ ఫోన్ ను కొన్నాడు. సెల్ ఫోన్ మాట్లాడుతుంటే వేడెక్కడాన్ని గమనించానని, ఆపై పొగలు వస్తుండగా దూరంగా పెట్టానని, చూస్తుండగానే అది పేలిపోయిందని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిత్తూరులోని సంస్థ సర్వీస్ సెంటర్ కు విషయాన్ని తెలియజేయాలని పోలీసులు సూచించగా, వారిని సంప్రదించి విషయాన్ని చెప్పాడు. తనకు తృటిలో ప్రాణాపాయం తప్పిందని, ఫోన్ కు వారంటీ ఉండటంతో తనకు మరో ఫోన్ ఇప్పించాలని డిమాండ్ చేశాడు.

Smart Phone
Blast
Chittoor District
  • Loading...

More Telugu News