Croetia: ఓడిపోయి ఇంటికి వచ్చినా... బ్రహ్మరథం పట్టిన క్రొయేషియన్లు!

  • వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడిపోయిన క్రొయేషియా
  • రెండో స్థానం వచ్చినా ఘన స్వాగతం
  • రాజధాని జాగ్రెబ్ వీధుల్లో లక్షలాది మంది ప్రజల కేరింతలు

ఆ దేశ జనాభా సుమారు 45 లక్షలు... అయితేనేం... ఏ మాత్రం అంచనాలు లేకుండా వరల్డ్ కప్ ఫుట్ బాల్ లో పోటీపడి, ఇంగ్లండ్ వంటి మేటి జట్లను ఓడించి, ఫైనల్ వరకూ చేరింది. ఫైనల్ లో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయి రెండో స్థానానికి పరిమితమైనప్పటికీ, క్రొయేషియా కుర్రాళ్లు చూపిన ప్రదర్శనకు యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది.

ఇక టోర్నీ అనంతరం ఆ జట్టు స్వదేశానికి చేరుకోగా, క్రొయేషియన్లు అపూర్వ స్వాగతం పలికారు. దేశ రాజధాని జాగ్రెబ్ పట్టణంలోని ప్రధాన సెంటర్ వద్ద సుమారు లక్ష మంది అభిమానులు తమ జట్టు ఆటగాళ్లను అభినందిస్తూ వెల్ కమ్ చెప్పారు. ఎయిర్ పోర్టు నుంచి ఓపెన్ టాప్ బస్సులో ఆటగాళ్లు వస్తూ, అభిమానులను పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ టోర్నీలో గోల్డెన్ బాల్ గెలుచుకున్న జట్టు కెప్టెన్ లుకా మోద్రిచ్ తో సెల్ఫీ దిగేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు.

  • Loading...

More Telugu News