Thota Trimurthulu: జీవోలు అమలు చేయకపోతే భోగి మంట వేసి వాటిని తగలబెడతా: ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు

  • బాబు జీవోలిచ్చినా అధికారులు పనులు చేయట్లేదు
  • కొర్రీలు వేసి పనులు ఆపుతున్నారు
  • ఆ జీవోలు తగలబెడతా..ఎవరు బాధపడినా ఫర్వాలేదు 

తూర్పు గోదావరి జిల్లా ఇరిగేషన్ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు జీవోలు ఇచ్చినా అధికారులు మాత్రం పనులు చేయడం లేదని, కొర్రీలు వేసి ఆపుతున్నారని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలోని జొన్నాడ, యానాం ఏటిగట్టు అభివృద్ధికి రూ.175 కోట్లు నిధులు విడుదలైనా ఇంకా పనులు పూర్తి చేయలేదని అన్నారు.

 పడవ ప్రమాద బాధితులను పరామర్శించే నిమిత్తం శేరిలంక గ్రామానికి వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడ్డానని, అభివృద్ధి పనుల విషయమై ఆ గ్రామస్తులు తనను నిలదీస్తే తలెత్తుకోలేకపోయానని అన్నారు. జీవోలు తక్షణం అమలు చేయకుంటే.. సెక్రటేరియట్ లో భోగిమంట వేసి వాటిని తగలబెడతానని, ప్రభుత్వం, అధికారులు బాధపడినా తనకు ఇబ్బందేమీ లేదని అన్నారు.

Thota Trimurthulu
East Godavari District
  • Loading...

More Telugu News