gutha sukhender reddy: ఉత్తమ్ చదువుకున్న అజ్ఞాని.. కోమటిరెడ్డి చదువుకోని అజ్ఞాని: గుత్తా సుఖేందర్ రెడ్డి

  • జానారెడ్డి రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది
  • కాంగ్రెస్ ది ఫ్యామిలీ పార్టీ కాదా?
  • కేసీఆర్ ను విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు

కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేత జానారెడ్డి రాజకీయాల నుంచి ఇక రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదని ఆయన సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చదువుకున్న అజ్ఞానైతే, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చదువుకోని అజ్ఞాని అని విమర్శించారు.

ఉత్తమ్ కుమార్ కుటుంబం నుంచి ఇద్దరు, కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని... మరి వీరిది ఫ్యామిలీ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు కలల్లో విహరిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం తథ్యమని... కాంగ్రెస్ కు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. 

gutha sukhender reddy
komatireddy
jana reddy
Uttam Kumar Reddy
kcr
congress
TRS
  • Loading...

More Telugu News