Rain: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక!

  • బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
  • రెండు రోజుల పాటు వర్షాలు
  • తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజులలోను ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత నాలుగు రోజులుగా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

అల్పపీడనం ప్రభావంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, సముద్ర తీరం వెంబడి మూడు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశాలు ఉన్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సలహా ఇచ్చింది. తీర ప్రాంతంలో గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా, పలు ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతాంగానికి ఈ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పొలాల్లో విత్తనాలు మొలకెత్తే దశలో భారీగా చేరుతున్న నీటితో అవి కుళ్లిపోవచ్చన్న భయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.

Rain
Andhra Pradesh
Telangana
IMD
  • Loading...

More Telugu News