Krishna District: రోజాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలుగు మహిళలు!

  • బోడె ప్రసాద్ పై రోజా విమర్శలు
  • ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
  • బహిరంగ క్షమాపణలు చెప్పాలన్న మహిళా నేతలు

తమ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ అనుబంధ 'తెలుగు మహిళ' సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంకిపాడు టీడీపీ కార్యాలయం నుంచి పోలీసు స్టేషన్ వరకూ ర్యాలీ నిర్వహించిన కృష్ణా జిల్లా తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు రాణి, సీఐ శివాజికి తన ఫిర్యాదును అందించారు.

 ఈ ప్రాంతంలో మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించే నేత బోడె ప్రసాద్ అని వ్యాఖ్యానించిన ఆమె, రోజా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆయనపై విమర్శలు చేస్తే ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు.

Krishna District
Kankipadu
Bode Prasad
Roja
Police
Complaint
  • Loading...

More Telugu News