Telugudesam: కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతివ్వాలని టీడీపీ ఎంపీలు కోరారు: కేకే
- ఈ విషయమై ఆలోచించి నిర్ణయం చెబుతాం
- విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందే
- ఇది రెండు రాష్ట్రాలకూ సంబంధించిన అంశం
ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం గురించి వివరించడానికి హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు (కేకే), జితేందర్ రెడ్డిలను ఈ రోజు టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శ్రీరామ్ మాల్యాద్రి కలిసిన విషయం తెలిసిందే. అనంతరం, కేశవరావు మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి అన్యాయం జరిగిన నేపథ్యంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తమ మద్దతు కావాలని టీడీపీ ఎంపీలు కోరారని చెప్పారు. ఈ విషయమై ఆలోచించి తమ నిర్ణయం చెబుతామని, విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని, ఇది రెండు రాష్ట్రాలకూ సంబంధించిన అంశమని అన్నారు.