Payal Rajput: అంత ధైర్యం ఉంది కాబట్టే ఇంత బోల్డ్ గా నటించాను!: 'ఆర్ ఎక్స్ 100' హీరోయిన్ పాయల్

  • గత వారం విడుదలైన 'ఆర్ఎక్స్ 100'
  • కలెక్షన్ల పరంగా దూసుకెళుతున్న చిత్రం
  • ధైర్యం, సాహసం ఉన్నాయి కాబట్టే చేశానన్న పాయల్

యూత్ చిత్రంగా గత వారం విడుదలై తొలి రోజు నుంచే ప్రేక్షకాదరణ పొందిన 'ఆర్ ఎక్స్ 100' కలెక్షన్ల పరంగా దూసుకెళుతుండగా, ఇందులో హీరోయిన్ గా తన అందాలను ఆరబోసిన పాయల్ రాజ్ పుత్, ఇంత బోల్డ్ గా నటించాలంటే ఎంతో ధైర్యం ఉండాలని, తనకా ధైర్యం ఉందని చెబుతోంది.

ఎంతో మంది హీరోయిన్లు ఈ పాత్రను నిరాకరించారని, నెగెటివ్ షేడ్ ఉన్న ఇలాంటి డేరింగ్ క్యారెక్టర్ చేయాలంటే సాహసం ఉండాలని, తాను ఏ మాత్రం భయపడకుండా సినిమాకు ఓకే చెప్పానని అంటోంది. రొటీన్ కు భిన్నంగా ఉన్న ఈ పాత్ర ప్రేక్షకులకు దగ్గర కావడం, పాయల్ అందం, అభినయం చూస్తున్న విశ్లేషకులు, ఆమెకు వరుస అవకాశాలు లభిస్తాయని జోస్యం చెబుతున్నారు.

Payal Rajput
RX 100
Tollywood
Movie
Bold Acting
  • Loading...

More Telugu News