Krishna District: టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పై రోజా ఫిర్యాదు

  • తన ప్రసంగంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బోడె ప్రసాద్
  • పెనమలూరు పీఎస్ లో కేసు పెట్టిన రోజా తరఫు న్యాయవాది
  • ప్రసాద్ మాట్లాడిన మాటల సీడీ అందజేత

కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, వైసీపీ ఎమ్మెల్యే రోజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రోజా తరఫు హైకోర్టు న్యాయవాది సుధాకర్ రెడ్డి, పెనమలూరు పోలీసు స్టేషన్ కు వచ్చి బోడె ప్రసాద్ మాట్లాడిన మాటల సీడీని పోలీసులకు అందించారు.

ఓ ఎమ్మెల్యేగా ఉన్న ప్రసాద్, అనాలోచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన వాడిన భాష దారుణంగా ఉందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఫిర్యాదు చేశారు. ఆపై ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని వైసీపీ కార్యకర్తలు పోలీసు స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. సీడీని అందుకున్న విషయాన్ని స్పష్టం చేసిన పెనమలూరు సీఐ రామోదర్ రావు, ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

Krishna District
Penamaluru
Roja
Bode Prasad
  • Loading...

More Telugu News