New Delhi: ఢిల్లీలో పాఠశాల వాష్‌రూమ్‌లో విద్యార్థిపై తోటి విద్యార్థులు బ్లేడ్లతో దాడి.. ఎయిమ్స్‌లో చికిత్స

  • 7వ తరగతి విద్యార్థి రఫీతో తోటి విద్యార్థి గొడవ
  • భోజన విరామం సమయంలో దాడి 
  • రఫీ వీపుపై 35 కుట్లు

ఢిల్లీలోని ఓ పాఠశాల బాత్‌రూమ్‌లో 7వ తరగతి బాలుడిపై తోటి విద్యార్థులు దారుణ ఘటనకు పాల్పడ్డారు. బాదార్‌పూర్‌లోని కేంద్రీయ విద్యాలయంలో క్లాస్‌ రూమ్‌లో సీటు విషయంలో రఫీ అనే విద్యార్థితో గొడవపడ్డ ఓ తోటి విద్యార్థి భోజన విరామం సమయంలో అతడిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. రఫీ బాత్‌రూమ్‌లో ఉన్న సమయంలో.. తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఆ విద్యార్థి బ్లేడ్లతో దాడిచేశాడు.

రఫీకి తీవ్ర రక్తస్రావం అయిన విషయాన్ని గుర్తించిన పాఠశాల యాజమాన్యం ఢిల్లీలోని ఎయిమ్స్‌కి తరలించింది. రఫీ వీపు భాగంలో వైద్యులు 35 కుట్లు వేశారు. దాడి చేసిన విద్యార్థులందరూ మైనర్లే కావడంతో ఇప్పటి వరకు వారిపై కేసు నమోదు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

New Delhi
aiims
  • Loading...

More Telugu News