YSRCP: వైసీపీలో చేరిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి!

  • సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన జగన్‌
  • వైఎస్సార్ పాలన జగన్ తోనే సాధ్యమన్న మాజీ ఎమ్మెల్యే  
  • కొనసాగుతోన్న జగన్ పాదయాత్ర

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఈరోజు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్‌ ఆయనకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దివంగత నేత వైఎస్సార్‌ పాలన జగన్ తోనే సాధ్యం అని, జగన్ ని ముఖ్యమంత్రిని చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా రామారెడ్డి మీడియాకి తెలిపారు. కాగా, జగన్ 212వ రోజు ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజక వర్గంలో కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News