Meghana bus: హైదరాబాద్‌లో మేఘన ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. ప్రయాణికుల ఆందోళన

  • ఊడిన బస్సు డీజిల్ ట్యాంకు
  • ప్రయాణికుల కేకలతో బస్సు నిలిపివేత
  • ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయని యాజమాన్యం

గత రాత్రి హైదరాబాద్ నుంచి గిద్దలూరు వెళ్తున్న మేఘన ట్రావెల్స్ బస్సు పెను ప్రమాదం నుంచి బయటపడింది. బస్సు బయలుదేరి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ పైకి రాగానే దాని డీజిల్ ట్యాంకు ఊడి కిందపడింది. గుర్తించిన ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్ వెంటనే బస్సును నిలిపి వేశాడు. బస్సు నుంచి ప్రయాణికులను దింపివేసిన యాజమాన్యం మరో బస్సును ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. యాజమాన్యం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Meghana bus
Hyderabad
Road Accident
  • Loading...

More Telugu News