Madhya Pradesh: భోపాల్‌లో యువకుడు నిర్బంధించిన యువతిని కాపాడిన పోలీసులు

  • యువతిని ఓ గదిలో నిర్బంధించిన యువకుడు
  • తనను తాను గాయపర్చుకున్న వైనం
  • ఇద్దరినీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఓ యువతిని ప్రేమోన్మాది రోహిత్‌ ఆమె ఇంట్లోని ఓ గదిలో నిర్బంధించిన విషయం తెలిసిందే. ఆమెను పోలీసులు ఎట్టకేలకు కాపాడారు. అయితే, తలుపు పగులకొట్టారా? లేక రోహిత్‌తో సంప్రదింపులు జరిపి తలుపు గడియ తీయించారా? అనే విషయం ఇంకా తెలియరాలేదు. ఆ యువతిని రోహిత్‌ గాయపర్చినట్లు సమాచారం.

ఈ ఘటనపై తాజాగా అక్కడి పోలీస్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ... తాము ఆమెను కాపాడి ఆసుపత్రికి తరలించామని, సదరు యువతి ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని చెప్పారు. నిందితుడు రోహిత్‌ కూడా తనను తాను కత్తెరతో పొడుచుకున్నాడని, ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆ యువతి ముంబయిలో మోడల్ అని, అక్కడే రోహిత్‌తో ఆమెకు పరిచయం ఏర్పడిందని చెప్పారు. కాగా, రోహిత్‌ వద్ద ఓ తుపాకీ కూడా ఉందని తెలిసింది. వారిద్దరూ గదిలో ఉండగా పోలీసులు వారికి బాల్కనీ ద్వారా ఆహారం అందించారు. 

Madhya Pradesh
girl
hostage
  • Loading...

More Telugu News