chiranjeevi: వర్షాలతో అంతరాయం.. అప్సెట్ అవుతున్న 'సైరా' టీమ్

  • కోకాపేటలో భారీ సెట్ 
  • పోరాట సన్నివేశాల చిత్రీకరణ 
  • వర్షాల కారణంగా షూటింగుకి ఆటంకం

చిరంజీవి కథానాయకుడిగా .. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' షూటింగ్ కొనసాగుతోంది. కోకాపేటలోని సువిశాలమైన ప్రదేశంలో వేసిన భారీ సెట్ లో కొన్ని రోజులుగా పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవితో పాటు ముఖ్యమైన పాత్రధారులు .. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ పోరాట సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాలు ఇవేనని చెబుతున్నారు.

అయితే అలాంటి ఈ సన్నివేశాల షూటింగుకి అంతరాయం కలుగుతోంది. నగరంలో కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాల కారణంగా ఏ రోజుకారోజు షూటింగుకి అంతరాయం కలుగుతోంది. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు వెనుదిరిగిపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగులో జాప్యం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు వర్షం కారణంగా మరింత ఆలస్యం జరుగుతుండటం సినిమా టీమ్ కి నిరాశాను కలిగిస్తున్నట్టుగా సమాచారం.      

  • Loading...

More Telugu News