America: రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా అమెరికా అధ్యక్షుడు.. ఆహ్వానించిన భారత్!

  • భారత ఆహ్వానంపై స్పందించని అమెరికా
  • ప్రస్తుతం రెండు దేశాల మధ్య విభేదాలు
  • ఇరాన్, రష్యాతో సంబంధాలపై అమెరికా కినుక

వచ్చే ఏడాది జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను భారత ప్రభుత్వం ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. భారత ఆహ్వానంపై అమెరికా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ట్రంప్ కనుక వేడుకలకు హాజరైతే ఒబామా తర్వాత వచ్చిన రెండో వ్యక్తి అవుతారు. 2015 గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యారు. మోదీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఒబామాను ఆహ్వానించారు.

కాగా, అమెరికా- భారత్ మధ్య ప్రస్తుతం సంబంధాలు అంత ఆశాజనకంగా లేవు. ఇరాన్‌తో భారత్ వాణిజ్య ఒప్పందాలు, రష్యాతో ఆయుధ డీల్‌పై అమెరికా గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో భారత ఆహ్వానం తిరిగి రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని పరిశీలకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, భారత రిపబ్లిక్ డే వేడుకలకు 2016లో అప్పటి ఫ్రెంచ్ ప్రధాని ఫ్రాంకోయిస్ హోలండ్ హాజరు కాగా, 2017లో అబుదాబి ప్రిన్స్ హాజరయ్యారు.  

America
Republic Day
chif guest
Donald Trump
  • Loading...

More Telugu News