High Court: హైకోర్టు ఏర్పాటుకు గడువు అంటూ లేదు: కేంద్ర ప్రభుత్వం
- విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని
- ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు మౌలిక వసతులు కల్పించాలి
- సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు అఫిడవిట్
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై ఎటువంటి తుది గడువు లేదని తెలిపింది. విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలిపింది. అలాగే, ఏపీలో హైకోర్టు ఏర్పాటుకు మౌలిక వసతులు కల్పించాలని, ఆ తరువాతే ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టుకు తెలపాల్సి ఉంటుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్ర న్యాయ శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మేరకు ఈ విచారణ కొనసాగుతోంది.