polavaram: పోటెత్తుతున్న వరద నీరు.. పోలవరం పనులు నిలిచిపోయే అవకాశం!

  • ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి పోటెత్తుతున్న వరద
  • పోలవరం వద్ద అంతకంతకూ పెరుగుతున్న నీటి మట్టం
  • స్పిల్ వే పనులు నిలిచిపోయే అవకాశం

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో పాటు, తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్ద వరద అంతకంతకూ పెరుగుతోంది. వరద ఉద్ధృతి మరింత పెరిగితే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న స్పిల్ వే పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. వరద నీరు పెరగడంతో వారం క్రితమే కాపర్ డ్యామ్ పనులు నిలిచిపోయాయి. వరద కొంచెం తగ్గితే పనులు యథావిధిగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

polavaram
flood
works
  • Loading...

More Telugu News