Chandrababu: రూ.5 కే భోజన పథకాన్ని ప్రారంభించి.. పేదలతో కలిసి తిన్న చంద్రబాబు

  • అన్న క్యాంటీన్ల ద్వారా తొలి దశలో 35 పట్టణాల్లో సేవలు
  • 100 క్యాంటీన్లు.. 2.15 లక్షల ప్లేట్ల ఆహారం 
  • మూడుపూటలా కలిపి రూ.15కే భోజనం

పేద, మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరకు మూడు పూటలా ఆహారాన్ని అందించే లక్ష్యంతో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 35 పట్టణాల్లో 100 క్యాంటీన్లు ప్రతిరోజు 2.15 లక్షల ప్లేట్ల ఆహారం అందించే లక్ష్యంతో నేటి నుండి పనిచేస్తాయని తెలిపారు. ఈ క్యాంటీన్‌ల ద్వారా రూ.5కే భోజనం చేయవచ్చని అన్నారు.

విజయవాడ విద్యాధరపురం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు అనంతరం పేదలతో కలిసి భోజనం చేశారు. మూడుపూటలా కలిపి రూ.73లు ఖర్చయ్యే ఆహారం ఈ క్యాంటీన్ల ద్వారా రూ.15కే అందుకోవచ్చు. ఇందుకు సంబంధించిన క్యాటరింగ్‌ బాధ్యతలను అక్షయపాత్ర సంస్థ నిర్వహిస్తోంది. ప్రతి క్యాంటీన్‌లో రోజుకు 250-300 మందికి ఆహారం అందనుంది. 

  • Loading...

More Telugu News