ntr: ఆ ఒక్క మాటతో ఎన్టీఆర్ కి కోపం వచ్చిందనే విషయం అర్థమైంది: పరుచూరి గోపాలకృష్ణ

  • ఎన్టీఆర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది 
  • మర్నాడు ఉదయమే బయల్దేరి రమ్మన్నారు 
  • ఖాళీ లేదనగానే కోపం వచ్చేసింది      

ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలకి రచయితగా పరుచూరి గోపాలకృష్ణ పనిచేశారు. అందువలన ఎన్టీఆర్ తో ఆయనకి ఎంతో అనుబంధం వుంది. అందుకు సంబంధించిన విషయాలను ఆయన తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమం ద్వారా పంచుకున్నారు.

"నేను మా ఊళ్లో ఒక సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటే అన్నగారు ఫోన్ చేశారు. రాజకీయాలకి సంబంధించిన కొన్ని భావాలను పంచుకోవాలనుకుంటున్నాము .. కొంచెం మీరొచ్చి ఏదైనా రాసిస్తారేమోనని' అన్నారు. 'అన్నగారూ నాకు ఖాళీ లేదండి' అన్నాను నేను. 'ఏం లేదు రేపు ఉదయం ఫ్లైట్ కి రండి సాయంత్రం ఫ్లైట్ కి వెళ్లిపోవచ్చు' అన్నారు. కాదు అన్నగారు .. స్క్రిప్ట్ పనిలో వున్నాను అన్నాను. 'సరే .. మీ ఇష్టం' అంటూ ఆయన ఫోన్ పెట్టేశారు.

ఆ మాటతో ఆయనకి కోపం వచ్చిందనే విషయం అర్థమైపోయింది. మాకు పేరు పెట్టిన మహానుభావుడు .. మాకు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు .. వెళ్లి తీరవలసిందే అని ఆ రాత్రంతా మెలకువతో వుండి నా పని పూర్తిచేసుకుని బయల్దేరాను. మర్నాడు ఉదయం అన్నగారితో కలిసి భోజనం చేశాను.. రాత్రంతా నిద్రలేదు కదా .. బాగా నిద్రపోయాను. అప్పటికే ఎన్టీఆర్ మూడుమార్లు కబురుపెట్టారట .. నాలుగోసారి నేను వెళ్లే సరికి 'ఏమి నిద్ర ఇది' అంటూ ఆయన నవ్వేశారు అని చెప్పుకొచ్చారు.      

  • Loading...

More Telugu News