ntr: ఎన్టీఆర్ అంత మాట అనేశారు .. ఆ మాటను తిరిగి అప్పగించేద్దామంటే కుదర్లేదు: పరుచూరి గోపాలకృష్ణ

  • చండశాసనుడు' సినిమాకి పనిచేశాను 
  • ఆ సమయంలో అన్నగారు నన్ను ఓ మాట అన్నారు  
  • 'నా దేశం' సమయంలో అలా సమాధానమిచ్చారు

'చండశాసనుడు' సినిమా సమయంలో అన్నగారు నన్ను ఒకమాట అన్నారు. ''నా ఇంట్లో నుంచి ఒక లక్ష రూపాయలు దొంగిలించి పారిపోయి మళ్లీ కనిపిస్తే క్షమిస్తాను .. నా జీవితంలో నుంచి ఒక నిమిషాన్ని దొంగిలిస్తే మాత్రం క్షమించను'' అన్నారు. నేను వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ వచ్చినందు వలన నాలో తెలియని ఈగో వుంటుంది కదా. అందుకే ఆయన ఆ మాట అనగానే 'ఇంతమాట అనేశారేంటి?' అనుకున్నాను. 'ఎప్పుడో ఒకచోట ఒక నిమిషం లేట్ చేసి దొరక్కపోతారా?' అనుకున్నాను.

ఆ తరువాత కొంత కాలానికి ఊటీలో 'నా దేశం' షూటింగ్ జరుగుతోంది. ఒక ఎక్స్ ప్రెషన్ మార్చడం కోసం ఎన్టీఆర్ మరో టేక్ తీసుకున్నారు. 'అక్కడే వున్న నేను .. ఇప్పుడు దొరికాడు ఈయన' అనుకుంటూ దగ్గరికి వెళ్లాను. 'అన్నగారూ మీరు నిమిషానికి చాలా విలువ ఇస్తారు గదా .. ఇందాకటి టేక్ కి .. ఇప్పటి టేక్ కి చిన్నతేడానే గదా వుంది. యూనిట్ లో 150 మంది వున్నారు .. 150 నిమిషాలు పోయినట్టే గదండి' అన్నాను.

ఆయన పెద్దగా నవ్వేసి " 59 .. 60 మార్కులకి మధ్య తేడా ఎంత బ్రదర్?' అని అడిగారు. 'ఒక మార్కు' అన్నాను నేను. '59 మార్కులు వచ్చిన వాడిని సెకండ్ క్లాస్ స్టూడెంట్ అంటారు .. 60 వస్తే ఫస్టు క్లాస్ స్టూడెంట్ అంటారు .. రెండవ టేక్ లో ఎక్స్ ప్రెషన్ మార్చుకుని ఆ ఒక్క మార్కు తెచ్చుకుని మేము ఫస్టు క్లాస్ స్టూడెంట్ అయ్యాము' అన్నారు. అంతే నేను ఆశ్చర్యపోయాను అంటూ చెప్పుకొచ్చారు.   

  • Loading...

More Telugu News