Lokesh: దేశంలోని అన్ని పేపర్లూ హెడ్ లైన్స్ లో రాసిన వార్తకు 'సాక్షి' ప్రాధాన్యత ఇవ్వలేదు: లోకేష్

  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి ఫస్ట్ ప్లేస్
  • లోపలి పేజీల్లో వార్తను ప్రచురించిన సాక్షి
  • ట్విట్టర్ ఖాతాలో విమర్శించిన లోకేష్

సులభరతర వాణిజ్యం రాష్ట్రాల్లో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్, రెండో స్థానంలో తెలంగాణ నిలిచిన నేపథ్యంలో ఈ వార్తను దేశవ్యాప్తంగా అన్ని పత్రికలూ ప్రముఖంగా ప్రచురించినప్పటికీ, 'సాక్షి'లో మాత్రం ఆ వార్త ప్రాధాన్యాన్ని మరిచారని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి స్థానంలో ఉందని దేశంలోని ప్రతి పత్రికా హెడ్ లైన్స్ లో ప్రచురించాయి. కానీ, సాక్షి మాత్రం లోపలి పేజీల్లో చిన్న వార్తగా రాసింది. జగన్, అతని మీడియా టీమ్ ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకమని చెప్పడానికి ఇంతకన్నా మెరుగైన నిదర్శనం ఏముంటుంది. నిజంగా దురదృష్టకరం" అని వ్యాఖ్యానించారు.

Lokesh
Ease Of Doing Business
Andhra Pradesh
Sakshi
Jagan
Nara Lokesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News