shakalaka shankar: నాకు అందుకే కోపం వచ్చింది .. పవన్ నన్ను అన్నది ఇదే!: షకలక శంకర్

  • పవన్ ను దగ్గరగా చూడాలని వుండేది 
  • అందుకే ఆ సినిమా చేశాను 
  • వాళ్లు అలా చేయడం కోపం తెప్పించింది

ఆ మధ్య ఒక సినిమా షూటింగులో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ పై షకలక శంకర్ నోరు పారేసుకున్నాడనీ, దాంతో పవన్ మందలించాడనే టాక్ వచ్చింది. కారణం ఏమైవుంటుందనే ఆసక్తి ఇప్పటికీ చాలామందిలో వుంది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో షకలక శంకర్ మాట్లాడుతూ ఉండగా ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది.

అప్పుడు ఆయన స్పందిస్తూ .. "నేను ఆ సినిమా ఒప్పుకున్నదే పవన్ కల్యాణ్ ను దగ్గర నుంచి చూడటానికి. ఏ సీన్ చెబుతున్నారని గానీ .. ఎలా చేయాలని గాని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పవన్ ని అలా చూస్తూ ఉండేవాడిని .. అయినా తనివి తీరేది కాదు. ఆ సినిమాకి తీసిన సీనే మళ్లీ మళ్లీ తీస్తుండేవాళ్లు.

దాంతో పవన్ డబ్బు అనవసరంగా ఖర్చు అవుతూ ఉండేది. అది తట్టుకోలేక కో డైరెక్టర్ పై అరిచాను. ఆ విషయం తెలిసి పవన్ నన్ను పిలిపించారు. 'ఏరా అప్పుడే డైరెక్టర్ ను .. కో డైరెక్టర్ ను అనే రేంజ్ కి వచ్చేశావురా నువ్వు .. వాళ్లు ఎన్నిసార్లు తీస్తే నీకెందుకు .. నీకు అవసరమా? నీ హద్దుల్లో నువ్వుండు .. పనిచేసుకుని పో .. అర్థమైందా .. పో' అన్నారు. ఆ రోజున జరిగింది ఇదే' అంటూ స్పష్టం చేశాడు.  

shakalaka shankar
  • Loading...

More Telugu News