roja: నాకు రోజా బహిరంగ క్షమాపణలు చెప్పాలి: ఎమ్మెల్యే బోడె ప్రసాద్

  • నాపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదు
  • రోజా ఆరోపణలతో నా కడుపు రగిలిపోతోంది
  • కాల్ మనీ కేసులో పోలీసుల అత్యుత్సాహం, వైఫల్యం ఉన్నాయి 

కాల్ మనీ, సెక్స్ రాకెట్, ఇసుక మాఫియా వంటి కుంభకోణాల్లో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాత్ర ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోడె ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, తనపై లేనిపోని ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే రోజా తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, మూడేళ్లుగా తనపై ఆమె చేస్తున్న ఆరోపణలతో తన కడుపు రగిలిపోతోందని మండిపడ్డారు. కాల్ మనీ కేసులో పోలీసుల అత్యుత్సాహం, వైఫల్యం ఉన్నాయని ఓ వ్యక్తికి సంబంధించిన విషయాన్ని రాష్ట్రం మొత్తానికి ఆపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

roja
bode prasad
  • Loading...

More Telugu News