shakalaka shankar: అందుకే నా పెళ్లి విషయం ఎవరికీ చెప్పలేదు: షకలక శంకర్

  • కొత్తవాళ్లతో వెంటనే కలవలేను 
  • నాకు పెళ్లైన మాట నిజమే
  • అమ్మాయి మా మేనత్త కూతురే

ఒక వైపున కమెడియన్ గా రాణిస్తూనే .. మరో వైపున హీరోగాను గుర్తింపు తెచ్చుకోవడానికి షకలక శంకర్ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తనకి అహంభావం ఎక్కువనే విమర్శలను గురించి ఆయన స్పందించాడు. "నాకు అహంభావం ఎక్కువనే కామెంట్స్ లో నిజం లేదు .. పదో తరగతిలో తెలుగు మాత్రమే పాస్ అయిన నాకు అహంభావం ఎలా ఉంటుంది?

చూసి కూడా చూడనట్టుగా నటించను .. నిజంగానే చూసి వుండను .. అంతే. కొత్తవాళ్లతో నేను అంత తొందరగా కలవలేను .. అందువలన కొంతమంది అలా అనుకుంటూ ఉండొచ్చు. ఇక నాకు పెళ్లైన మాట నిజమే .. నేనే ఎవరికీ చెప్పలేదు. పెళ్లి చేసుకున్నానని చెబితే సరిపోదు గదా .. అందరికీ భోజనాలు పెట్టాలి .. నా పరిస్థితి మీకు తెలుసుగా. అప్పుజేసి మరీ అందరికీ భోజనాలు పెట్టే పరిస్థితి లేదు .. అందుకే మా ఊరెళ్లిపోయి పెంకుటింట్లో హ్యాపీగా పెళ్లిచేసుకున్నాను .. అమ్మాయి ఎవరో కాదు మా మేనత్త కూతురే" అంటూ చెప్పుకొచ్చాడు.  

shakalaka shankar
ali
  • Loading...

More Telugu News