ntr: హిందీలోను రాజమౌళి మల్టీ స్టారర్ .. రంగంలోకి కరణ్ జొహార్

  • 300 కోట్లతో రాజమౌళి మల్టీస్టారర్
  •  హిందీలోను రిలీజ్ చేయాలనే ఆలోచన 
  • నవంబర్ నుంచి సెట్స్ పైకి  

'బాహుబలి' సినిమా హిందీ వెర్షన్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జొహార్ తన ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా భారీస్థాయిలో విడుదల చేశారు. ఈ సినిమాకి ఆయన అక్కడ కల్పించిన భారీ ప్రచారం కారణంగానే ఆ స్థాయిలో అక్కడ లాభాలను తెచ్చిపెట్టింది. భారీ స్థాయిలో ఈ సినిమా జనంలోకి వెళ్లడంలో కరణ్ జొహార్ కీలకమైన పాత్రను పోషించారు. అందువలన తన తాజా చిత్రమైన మల్టీస్టారర్ ను కూడా హిందీలో విడుదల చేయాలనే ఆలోచనలో రాజమౌళి వున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఎన్టీఆర్ .. చరణ్ నటించే ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ భారీ బడ్జెట్ కావడం వలన .. హిందీలోనూ విడుదల చేస్తేనే వర్కౌట్ అవుతుందని భావించి, హిందీలో విడుదల చేయడానికి కరణ్ జొహార్ ని రంగంలోకి దింపబోతున్నట్టుగా తెలుస్తోంది. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.   

  • Loading...

More Telugu News