Rohit Sharma: దూరమైన ప్రియ మూగజీవం 'సుడాన్'కు తాజా సెంచరీని అంకితమిచ్చిన రోహిత్ శర్మ!

  • అద్భుత సెంచరీ సాధించిన రోహిత్
  • అత్యంత అరుదైన తెల్ల ఖడ్గమృగం సుడాన్ కు అంకితం
  • గత మార్చిలో అనారోగ్యంతో మరణించిన సుడాన్

తన అద్భుతమైన సెంచరీతో ఇంగ్లండ్ పై మ్యాచ్ ని గెలిపించడం ద్వారా టీ-20 సిరీస్ దక్కేలా చేసిన రోహిత్ శర్మ, తన సెంచరీని అత్యంత అరుదైన తెల్ల ఖడ్గమృగం సుడాన్ కు అంకితమిచ్చినట్టు తెలిపాడు. స్వతహాగా జంతు ప్రేమికుడైన రోహిత్ శర్మకు సుడాన్ అంటే ఎంతో ఇష్టం. గత మార్చిలో సుడాన్ మరణించగా, ఆపై తన సంతాపాన్ని కూడా తెలిపాడు రోహిత్.

ఇక తన తాజా సెంచరీని సుడాన్ కు అంకితమిస్తూ, "నాకు దూరమైన స్నేహితుడు సుడాన్ కు ఈ సెంచరీ అంకితం. ఈ ప్రపంచాన్ని ప్రతి ఒక్కరి నివాసానికీ మెరుగైన స్థలంగా మార్చే రహదారిని కనుగొందాం" అని తన ట్విట్టర్ ఖాతాలో రోహిత్ వ్యాఖ్యానించాడు. గంట వ్యవధిలోనే ఈ పోస్టుకు 10 వేలకు పైగా లైక్స్ రావడం గమనార్హం. కాగా, 45 ఏళ్ల వయసులో సుడాన్, తీవ్ర అనారోగ్యం బారిన పడి మరణించింది.  

Rohit Sharma
Sudan
Rinho
Century
  • Error fetching data: Network response was not ok

More Telugu News