South Korea: ఈసారి అమ్మాయిల వంతు... లైవ్ ఇస్తున్న రిపోర్టర్ పై ముద్దుల వర్షం... వీడియో చూడండి!

  • రష్యాకు వెళ్లిన దక్షిణ కొరియా రిపోర్టర్
  • కెమెరా ముందు మాట్లాడుతుంటే కిస్ చేసి వెళ్లిన అమ్మాయిలు
  • సిగ్గుపడి, ఆపై తన డ్యూటీ కొనసాగించిన జియాన్ వాంగ్

రష్యాలో జరుగుతున్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ పోటీలకు వెళ్లి ప్రత్యక్ష ప్రసారం ఇస్తున్న లేడీ రిపోర్టర్లకు ముద్దులు పెడుతూ లైంగికంగా వేధిస్తున్న వీడియోలు బయటకు రాగా, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. దక్షిణ కొరియాకు చెందిన 'ఎంబీఎన్' అనే చానల్ తరఫున పనిచేస్తున్న యువకుడు జియాన్ వాంగ్ రియల్, నడిరోడ్డుపై నిలబడి లైవ్ రిపోర్టింగ్ ఇస్తుంటే, ఇద్దరు రష్యన్ అమ్మాయిలు వచ్చి గట్టిగా పట్టుకుని చుంభించి వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనతో ఒక్క క్షణం కంగారుపడిన ఆ రిపోర్టర్, ఆపై కాసేపు సిగ్గుపడి, తిరిగి తన డ్యూటీని కొనసాగించాడు.

ఇక అమ్మాయిని అబ్బాయి కిస్ చేస్తే, మహిళలకు భద్రత లేదని స్పందించిన వారంతా, ఇప్పుడు పురుష రిపోర్టరుపై జరిగిన లైంగిక వేధింపులపై మాట్లాడరేంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జరిగిన ఘటనపై ఎంబీఎన్ చానల్ స్పందిస్తూ, వరల్డ్ కప్ పోటీలను కవర్ చేసేందుకు రష్యా వెళ్లిన తమ జర్నలిస్టును ఇద్దరు రష్యా అమ్మాయిలు వేధించారని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

South Korea
Live Reporting
Kiss
Russia
  • Error fetching data: Network response was not ok

More Telugu News