hanuman: నేరుగా హనుమాన్‌ ఆలయానికి వెళ్లిన పరిపూర్ణానందస్వామి

  • ఉదయం నుంచి గృహనిర్బంధంలో పరిపూర్ణానంద
  • ఏకాదశి సందర్భంగా పూజలు చేయాలన్న శ్రీపీఠాధిపతి
  • అనుమతించిన పోలీసులు
  • కొనసాగుతోన్న పూజలు

హైదరాబాద్‌, జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో ఉదయం నుంచి గృహ నిర్బంధంలో ఉన్న శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందస్వామి సాయంత్రం బయటకు వచ్చి తాను తన 'ధర్మాగ్రహ' యాత్రను చేసి తీరతానని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఆయన తన నివాసం నుంచి నేరుగా మింట్‌కాంపౌండ్‌ హనుమాన్‌ ఆలయానికి వెళ్లారు. ఏకాదశి సందర్భంగా పూజలు చేయాలని పరిపూర్ణానంద చెప్పడంతో పోలీసులు ఆయనకు అనుమతినిచ్చారు.

దీంతో ఆలయంలో ఆయన పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, స్వామి పరిపూర్ణానంద ఇంటి వద్ద ఈరోజు మధ్యాహ్నం  కలకలం చెలరేగింది. ఆయన గృహ నిర్బంధాన్ని నిరసిస్తూ ఒక వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు చెలరేగేలా సోషల్‌ మీడియాలో పోస్టులు చేయకూడదని పోలీసులు కోరుతున్నారు. 

hanuman
temple
paripoornananda
  • Loading...

More Telugu News