talak: యూపీలో.. రోటీ మాడిపోయిందన్న కోపంతో భార్యకు తలాక్ చెప్పేశాడు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-d7d9f2772eb6766e4e4ee6c004cbdd6be266b95a.jpg)
- ఉత్తరప్రదేశ్ మహాబా జిల్లాలో ఘటన
- పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
- భర్తపై గృహ హింస కేసు నమోదు చేసిన పోలీసులు
తలాక్ చెప్పి భార్యలను వదిలేస్తున్న ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా రోటీ మాడిపోయిందనే ఆగ్రహంతో తన భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పాడు ఓ భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ మహోబా జిల్లాలోని పహ్రెతా గ్రామంలో చోటు చేసుకుంది. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా భర్తపై గృహ హింస కేసు నమోదు చేశారు. ఏడాది క్రితమే వీరిద్దరికీ వివాహమైంది. తలాక్ చెప్పిన మూడు రోజుల ముందు నుంచి సిగరెట్లతో కాలుస్తూ తనను తీవ్రంగా హింసించాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.