bellamkonda: వినాయక్ చేతుల మీదుగా యంగ్ హీరో మూవీ లాంచ్

  • తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ 
  • కథానాయికగా కాజల్ 
  • ముఖ్యమైన పాత్రలో సోనూసూద్

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. కొంతసేపటి క్రితం ఈ సినిమా హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా అయిన 'అల్లుడు శీను' దర్శకుడు వినాయక్ చేతుల మీదుగా ఈ సినిమా మొదలుకావడం విశేషం.

వినాయక్ క్లాప్ ఇవ్వగా .. రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ తో 'సాక్ష్యం' సినిమా చేసిన శ్రీవాస్ .. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి షాట్ కు తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తోంది .. తేజ దర్శకత్వంలో ఆమెకి ఇది మూడవ సినిమా. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో సోనూ సూద్ కనిపించనున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.         

  • Loading...

More Telugu News