akhil: అఖిల్ మూవీలో దుమ్మురేపేసే ఐటమ్ వుంటుందట

  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ 
  • పరిశీలనలో 'మిస్టర్ మజ్ను' టైటిల్ 
  • ఈ ఏడాది చివరిలో విడుదల  

ప్రస్తుతం అఖిల్ .. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమాకి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో అదరగొట్టేసే ఒక ఐటమ్ సాంగును పెట్టాలనే ఉద్దేశంతో వెంకీ అట్లూరి ఉన్నాడట.

 ఈ హాట్ సాంగ్ ను ఎవరితో చేయిస్తే బాగుంటుందా అని బాగా ఆలోచించిన ఆయన, చివరికి 'ఫరా కరిమి'ని ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ 'గౌతమీ పుత్ర శాతకర్ణి' .. సాయిధరమ్ తేజ్ 'తిక్క' సినిమాలోను ఫరా కరిమి ఐటమ్ సాంగ్స్ తో ఆకట్టుకుంది. వెంకీ అట్లూరి తన తొలిసినిమా 'తొలిప్రేమ' మాదిరిగానే ఈ సినిమాను కూడా ఫీల్ గుడ్ మూవీ గానే రూపొందిస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నాడు.    

akhil
nidhi agarwal
  • Loading...

More Telugu News